NTV Telugu Site icon

Mother Cruelty: తాళ్ళతో కాళ్ళుచేతులు కట్టి.. కన్నతల్లి కాదు కసాయి

Child

Child

నవమాసాలు మోసి, కని పెంచిన తల్లి అంటే సమాజంలో ఎంతో గౌరవం.. అందుకే తల్లిని మాతృదేవోభవ అంటారు. అంటే తల్లి దేవుడితో సమానం అని అర్థం. కానీ కొంతమంది తల్లులు కర్శశంగా మారిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ తల్లి చేసిన పని సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. పాలకొండలో కన్నతల్లి కర్కశం తాళ్లతో కాళ్లు చేతులు కట్టి నిర్బంధించింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తన చిన్నారిని ఓ తల్లి ఎలా చేతులు కాళ్లు కట్టేసి కర్కశంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది.

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న కెల్లశ్రీను, కెల్ల లక్ష్మిల పెద్ద కుమార్తె పూర్ణిమ. శ్రీను ఓ భోజన హోటల్లో పనిచేస్తుండగా లక్ష్మి హాస్టల్ లో హెల్పర్ గా పనిచేస్తుంది. శ్రీను తన విధులకు వెళ్లిపోయిన వెంటనే లక్ష్మి సైతం తన చిన్న కుమార్తెను తనతో తీసుకెళ్ళింది. అంగన్ వాడి కేంద్రానికి వెళ్లాల్సిన పెద్ద కుమార్తె వెళ్లనని మారాం చేయడంతో ఇలా చేతులు కాళ్లు కట్టేసి పక్కింటి బయట కూర్చోబెట్టింది.

దాహం, దాహం అని చిన్నారి ఏడవడంతో అటుగా వెళ్లిన కొందరు చూసి తండ్రికి సమాచారం అందించారు. తరచూ ఆమె ఇలానే ప్రవర్తిస్తుందని కాలనీ వసూలు చెప్తున్నారు. ఇటీవలే ఐదేళ్ల చిన్నారి పూర్ణిమను ఇంట్లో పెట్టి తాళం వేసుకొని వెళ్లిపోయిందని చిన్నారి గట్టిగా ఏడవడంతో చుట్టుపక్కల వారు తాళాలు తీసి చిన్నారిని బయటకు తీసుకువచ్చారని చెబుతున్నారు. లక్ష్మీ ప్రవర్తనపై శ్రీను పాలకొండ పోలీసులు దృష్టికి తీసుకువెళ్లారు. సమీపంలోనే బంధువులు ఉన్నప్పటికీ కనీసం వారింట్లోనైనా పూర్ణిమను ఉంచితే బాగుండేదని, కానీ ఇలా చేతులు కాళ్లు కట్టేసి ఉంచడంపై మహిళలు మండిపడుతున్నారు.

Manali Rathod: ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చిన టాలీవుడ్ బ్యూటీ!