NTV Telugu Site icon

కన్న బిడ్డను కోట్టి చిత్రహింసలు పెట్టిన తల్లి…

తమిళనాడులో మాతృత్వానికి మచ్చ తెస్తూన్న ఓ ఘటన కలకలం రేపుతోంది. కన్న బిడ్డను కొట్టి రకరకాలుగా చిత్రహింసలు పెట్టింది తల్లి తులసీ. దాంతో ఆ రెండేళ్ళ బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విల్లిపురం జిల్లాలోని సత్యమంగళం మెట్టూరు గ్రామానికి చెందిన వడివేలన్.. చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులసిని పెళ్ళి చేసుకున్నాడు. వారికి గోకుల్ (4) ప్రదీప్ (2) అనే పిల్లలు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్తపై కోపంతో పసిబిడ్డను చిత్రహింసలు పెట్టిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. తల్లి తులసి కోసం తమిళనాడు నుండి ప్రత్యేకంగా పోలీసు టీంలను చిత్తూరుకు పంపింది స్టాలిన్ సర్కారు.