NTV Telugu Site icon

Anantapur Crime: హత్యలు, అత్యాచారాలు.. అనంతలో ఏం జరుగుతోంది?

Atp Crime

Atp Crime

సత్యసాయి అనంతపురం జిల్లాలో మహిళపై జరుగుతున్న ఆకృత్యాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఒక రేప్ , రెండు మర్డర్ లు, ఒక ఆత్మహత్య, ఓ హత్యయత్నం…. ఇలా నాలుగు రోజులలో వ్యవధిలోనే రెండు జిల్లాలో వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. తేజస్విని , సరస్వతి దారుణమైన ఘటనలు ఇంకా ముగియకముందే శ్రీసత్య సాయి జిల్లాలో మరో రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. తనను ప్రేమించాలని ఓ మైనర్ బాలికను వేధించాడు ఓ యువకుడు.

దీంతో తల్లిదండ్రులు బాలికను స్కూల్ మాన్పించారు. అయినా వదకుండా ఇంటి వద్దకే వెళ్లి పెళ్లి చేసుకోవాలని కత్తితో బెదిరించాడు.అలాగే మరొక ప్రాంతంలో ఒంటరిగా బహిర్భూమికి వెళ్లిన మహిళను అతి కిరాతకంగా రాళ్లతో కొట్టి హతమార్చారు. ఈ ఘటనలు ఒకసారి పరిశీలిస్తే…గోరంట్ల మండలంలో బీ-ఫార్మసీ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర దుమారం రేపింది. గోరంట్లకు చెందిన తేజస్వినీ తిరుపతిలో బీ ఫార్మసీ చదువుతోంది. అయితే అనుకోకుండా ఆ విద్యార్థిని గోరంట్ల మండలం మల్లాపురంలోని ఒక తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమెను గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేశారన్న ఆరోపణలతో రాష్ట్రంలో ఒక్కసారిగా దుమారం రేగింది.

గోరంట్లకు చెందిన తేజస్విని… సాధిక్ అనే 32ఏళ్ల యువకుడి కుటుంబం ఒకే వీధిలో ఉండేవారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఈ క్రమంలో పక్క వీధిలో కి తేజస్విని కుటుంబ సభ్యులు గత ఏడాది మారారు. ఆ తర్వాత తేజస్వినీ బీఫార్మసీ చదివేందుకు తిరుపతికి వెళ్లింది. ప్రస్తుతం థర్ట్ ఇయర్ బీ ఫార్మసీ చదవుతోంది. సాదిక్ ఫోన్ కాల్ తో ఈనెల 4 నతేజస్వినీ గోరంట్లకు వచ్చింది. ఆ తర్వాత మరుసటి రోజు తేజస్విని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ప్రచారం సాగింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం, రీ పోస్టుమార్టం నిర్వహించి చివరకు రేప్ జరగలేదని ఎస్పీ ,ఫోరెన్సిక్ వైద్యుల బృందం నిర్దారించారు. కుటుంబ సభ్యుల ఆరోపణలు , రాజకీయ పార్టీల నిరసనలతో కేసును రేప్ కేసుగా మారుస్తూ దిశ పోలీసులకు అప్పగించారు.

తేజస్విని ఘటన జరిగిన రోజే ..గోరంట్ల మండలంలోని రెడ్డి చెరువు పల్లి మండలం వడ్డీ పల్లి వద్ద మంగమ్మ అనే ఇరవై ఐదు సంవత్సరాల మహిళను దారుణంగా హత్య చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హత్య చేసింది రామచంద్ర అనే 50 సంవత్సరాల వ్యక్తి అని గుర్తించారు. మంగమ్మకు ఆర్నెల్ల క్రితమే భర్త చనిపోయాడు, దీంతో ఆమె రామచంద్ర అనే వ్యక్తి తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. అతని తోనే కాక తిమ్మయ్య అనే మరో వ్యక్తితో కూడా సంబంధాన్ని కొనసాగించడం ప్రారంభించింది. దీంతో రెడ్డి చెరువుపల్లి వద్దకు మంగమ్మని పిలిచి దారుణంగా చంపేశాడు. చివరకు ఆ శవాన్ని తీసుకెళ్లి వడ్డిపల్లి గ్రామ శివారులో ఉన్న చింత చెట్టుకు ఉరి వేసినట్లు చిత్రీకరించాడు నిందితుడు.

మరోవైపు ప్రేమ పేరుతో ఎస్ఐ చేతిలో వంచనకు గురై యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలోని పామిడి మండలం జీవీ కొట్టాలలో చోటుచేసుకుంది. విజయ్ కుమార్ నాయక్ తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్ఐ గా పని చేస్తున్నాడు. భారతి అనే మహిళను వివాహం చేసుకుని సరస్వతి అనే యువతితోనూ ప్రేమాయణం నెరిపాడు. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. పురుగుమందు తాగి యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈఘటన మరకముందే కనగానపల్లి మండల పరిధిలోని కొండపల్లి పాతపాల్యం మమత (35) అనే మహిళను రాళ్లతో కొట్టి చంపారు. మహిళ ఓంటరిగా బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఆత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు.

అదే రోజు హిందూపురం మున్సిపల్ పరిధిలోని సడ్లపల్లిలో ఏడాదిగా ఓ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తూ పెళ్లి చేసుకోకపోతే చంపుతానని బెదిరించిన వెంకటేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజీకి వెళ్లేటప్పుడు మరియు వచ్చేటప్పుడు ఆమె వెంటపడి ప్రేమించుమని వేధించేవాడు. గత 6 నెలల క్రిందట వెంకటేష్ బాధితురాలు వెంటపడి కాలేజీకి వచ్చినప్పుడు ఆమెచెయ్యి పట్టుకొని ఎక్కడికైనా వెళ్లి పెళ్ళి చేసుకుందాం అని ఇబ్బంది పెట్టేవాడు. 4 రోజుల క్రితం రాత్రి సమయంలో ఇంటి బయట ఉన్న యువతిని వెంకటేష్ కత్తితో బెదిరించి తనను వివాహం చేసుకోవాలని లేకుంటే నీ తల్లిదండ్రులను చంపుతాను అంటూ బెదిరించాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేష్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఇలా సత్యసాయి , అనంతపురం జిల్లాలో నాలుగు రోజులుగా జరుగుతున్న వరుస సంఘటనలు సంచలనం కల్గిస్తున్నాయి.

Podalakuru Gun Fire Incident: తాటిపర్తి కాల్పుల ఘటనలో కీలక దర్యాప్తు