Site icon NTV Telugu

Mohanbabu Support TDP Live: టీడీపీకి మోహన్ బాబు సపోర్ట్.. ఏం జరుగుతోంది?

Maxresdefault (2)

Maxresdefault (2)

Live: టీడీపీకి మోహన్‌బాబు సపోర్ట్ .? | Mohanbabu key meeting with Chandrababu | Ntv

ఏపీ రాజకీయాలు ఇప్పుడు హైదరాబాద్ కు మారాయా? టీడీపీ అధినేత చంద్రబాబుతో డైలాగ్ కింగ్ మోహన్ బాబు మాట కలిపారు. జూబ్లీహిల్స్‌లో సినీ నటుడు మోహన్‌బాబు చంద్రబాబు నివాసానికి వెళ్లడం హాట్ టాపిక్ అవుతోంది. రాజకీయాలపై దాదాపు గంటకుపైగా వీరు చర్చించుకున్నారు. అయితే వీరిద్దరి భేటీ ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. తన విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు ఫీజు రీఎయింబర్స్ మెంట్ చెల్లించలేదని.. గత ఎన్నికలకు ముందు తిరుపతిలో మోహన్ బాబు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు, మోహన్ బాబు మధ్య గ్యాప్ పెరిగింది. చాల రోజుల తర్వాత తాజాగా చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బాలయ్య బాబు వీరిద్దరి భేటీకి మార్గం వేశారని అంటున్నారు.

Exit mobile version