NTV Telugu Site icon

Modi Ap Tour: ప్రధాని మోడీ భీమవరం టూర్ కి భారీ భద్రత

Modi Ap

Modi Ap

పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరంలో ప్రధాని నరేంద్రమోడీ సోమవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భీమవరం లో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహన్ని ఆవిష్కరించిన అనంతరం పెద అమిరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భీమవరం లో సందడి వాతావరణం నెలకొంది. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రధాని భీమవరంలో పర్యటించనున్నారు. 30అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో చేస్తున్న భారీ ఏర్పాట్లకు వర్షం అడ్డంకిగా మారింది. అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షంతో సభ ప్రాంగణం వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది. మరోపక్క వాహనాలకు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాలు బురదతో నిండిపోయాయి. పీఎం సభ ఏర్పాటుకు వర్షం కొంత ఆటంకంగా మారిందనే చెప్పాలి.

సభా ప్రాంగణం వద్ద చేరిన వర్షపు నీటిని మోటార్ల ద్వారా బయటికి పంపించే ఏర్పాట్లు చేశారు. ఉదయం విజయవాడ నుంచి హెలికాప్టర్ లో 10:55కి పేదఅమిరం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. 11గంటల నుంచి 12:15 వరకు బహిరంగ సభ కొనసాగనుంది. సభా వేదికపై ప్రధాని మోడీ తో పాటు సీఎం జగన్, గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. మోడీ పర్యటనకు 3వేల మందితో భారీ భద్రత ఏర్పాటుచేశామని ఏలూరు రేంజ్ డీఐజీ తెలిపారు. పలువురు వాలంటీర్స్ ని ట్రాఫిక్ నియంత్రించేందుకు ఉపయోగిస్తాం అన్నారు. సభా ప్రాంగణానికి వచ్చేవారు ట్రాఫిక్ ఆంక్షలు పాటించాలని ఆయన సూచించారు. మోడీ పర్యటన ఆటంకాలు లేకుండా జరగడానికి అంతా సహకరించాలన్నారు సభకు 60వేల మంది హాజరవుతారని అంచనా వేశామన్నారు. కార్లలో వచ్చేవారు సంఖ్య ఎక్కువగా వుతుందని అంచనా.. ప్రధాని పర్యటన ఆటంకాలు లేకుండా జరగడానికి అంతా సహకరించాలి. ఎవ్వరి విషయంలో అయినా పోలీసులు చట్ట ప్రకారమే నడుచుకుంటారని ఆయన చెప్పారు.

Amit Shah : కేటీఆర్‌ ను సీఎం చేసేందుకే కేసీఆర్‌ వ్యూహాలు

నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణం రాజు విషయంలో కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామన్నారు ఏలూరు రేంజ్ డీఐజీ. హెలిప్యాడ్, వీఐపీ గెస్ట్ లిస్ట్ లో ఆయన పేరు లేదన్నారు. మరోవైపు కాళ్ల మండలం పెద్ద అమిరం గ్రామంలో ప్రధాని పాల్గొనే సభా ప్రాంగణాన్ని పరిశీలించారు ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి. పోలీసులకు పలు సూచనలు చేశారు. ప్రధాని పర్యటన ముగిసేవరకు సభా ప్రాంగణం, హెలిప్యాడ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. స్థానికంగా వుండే దుకాణాలు మూత పడనున్నాయి.బీజేపీ, వైసీపీ నేతలు సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

BJP Ravi Shankar Prasad : హైదరాబాద్ సర్దార్ పటేల్ ఇచ్చిన గిఫ్ట్