PVN Madhav: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్‌లో విభేదాలు ఉన్నాయని తరచూ ప్రచారం సాగుతోంది.. బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా వ్యవహారం తర్వాత.. దీనిపై మరింత చర్చ సాగింది.. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహారం నచ్చని రాష్ట్ర నేతలు.. అధిష్టానానికి ఫిర్యాదు చేశారని.. సోము వీర్రాజును పదవి నుంచి తప్పిస్తే తప్ప.. పార్టీలో కొనసాగలేమని తేల్చిచెప్పినట్టు కూడా ప్రచారం సాగుతూ వచ్చింది.. అయితే, అలాంటి పరిస్థితి లేదంటున్నారు కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు.. ఈ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్.. రాష్ట్ర బీజేపీలో అభిప్రాయం బేధాలు ఉన్నాయి.. తప్పితే విభేదాలు లేవన్నారు..
Read Also: AP SI Preliminary Results 2023: ఎస్‌ఐ పరీక్షల ఫలితాలు విడుదల..
బీజేపీలో వర్గ రాజకీయాలకు ఆస్కారం లేదని స్పష్టం చేసిన ఆయన.. ప్రెసిడెంట్ ప్రిసైడ్స్.. టీమ్ డిసైడ్స్ అనే విధానానికి కట్టుబడి పని చేస్తామన్నారు.. ఇక, పార్టీ నాయకులు ఎవరూ పదవులు వాడుకోవడానికి సిద్ధంగా లేరన్నారు.. అభిప్రాయ బేధాలతో పార్టీ వీడాల్సిన నాయకులు ఇప్పటికే వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్.. కాగా, కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన తర్వాత.. మరికొంత మంది నేతలు కూడా రాజీనామా చేసిన విషయం విదితమే.. ఇంకా కొంత మంది సోము వీర్రాజును మార్చాల్సిందే నంటూ డిమాండ్ చేయడంతో.. ఏపీ బీజేపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.