Site icon NTV Telugu

Andhra Pradesh: మార్చి 24న ఉప ఎన్నిక.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

ఏపీలో మరోసారి ఎన్నికల సందడి కనిపించబోతోంది. ఈ మేరకు ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్సీ కరీమున్నీసా స్థానాన్ని భర్తీ చేయాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో తాజాగా ఎన్నికల షెడ్యూల్ జారీ చేసింది. మార్చి 24న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. అదే రోజున కౌంటింగ్ కూడా నిర్వహిస్తామని తెలిపింది

ఈ ఉప ఎన్నికకు సంబంధించి మార్చి 7న నోటిఫికేషన్ విడుదల కానుంది. 14వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఈసీ తెలిపింది. మార్చి 15న స్క్రూటినీ నిర్వహించనుండగా.. మార్చి 17 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది కానుంది. కరీమున్నీసా స్థానాన్ని ఆమె కుమారుడితో భర్తీ చేయాలని ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ స్థానం ఏకగ్రీవం కానుంది.

Exit mobile version