Site icon NTV Telugu

MLC Anantha Babu: నా బెయిల్‌ను పొడగించండి.. హైకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు పిటిషన్‌

Mlc Anantha Babu

Mlc Anantha Babu

డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత‌బాబుకు మ‌ధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. అనంత‌బాబు త‌ల్లి అనారోగ్య కార‌ణాల‌తో ఆదివారం మృతి చెందగా.. ఈ నేప‌థ్యంలో త‌న త‌ల్లి అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేలా త‌న‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో.. అనంత‌బాబుకు 3 రోజుల పాటు బెయిల్ మంజూరు చేస్తూ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కోర్టు ప‌లు ష‌ర‌తులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.. ఇక, ఈ నెల 25 మ‌ధ్యాహ్నం తిరిగి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైలుకు వ‌చ్చి లొంగిపోవాల‌ని స్పష్టం చేసింది.. అంతేకాదు.. ఈ మూడు రోజుల పాటు స్వ‌గ్రామం ఎల్ల‌వ‌రం దాటి బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని కూడా ఆదేశించింది.. అయితే, బెయిల్‌ పొడిగించాలంటూ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ అనంతబాబు..

Read Also: V Hanumantha Rao: నోటీసులు ఇవ్వడమే కాదు.. ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా చేయాలి

తల్లి అంత్యక్రియల కోసం ఎమ్మెల్సీ అనంతబాబుకు ఇచ్చిన మూడు రోజుల మధ్యస్తూ బెయిల్ ను మరో 11 రోజులు పొడిగించాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు ఆయన తరపు న్యాయవాదులు.. హైకోర్టులో కాసేపట్లో వాదనలు జరగనున్నాయి.. కాగా, ఈ రోజు ఉదయం ఎల్లవరంలో తన తల్లి అనంత మంగారత్నం అంత్యక్రియలు నిర్వహించారు ఎమ్మెల్సీ అనంతబాబు.. 25వ తేదీ సాయంత్రం 5గంటలతో ఆయన మధ్యస్తు బెయిల్ గడువు ముగియనుంది.. ఈ నేపథ్యంలో.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు.. మరోవైపు.. రేపు అనంతబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణ సాగనుంది.

Exit mobile version