నిత్యం రాజకీయాలతో బిజీగా వుండే నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా ఆటవిడుపుతో అలరించారు. తన నియోజకవర్గమయిన నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామీణ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. తనకెంతో ఇష్టమయిన కబడ్డీ ఆడి అలరించారు ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి.
గతంలోనూ అనేక సార్లు రోజా కబడ్డీ ఆడారు. గ్రామీణ క్రీడల పునరుత్తేజానికి అంతా పాటు పడాలన్నారు. ఖాళీ వున్నప్పుడల్లా కబడ్డీ ఆడాలన్నారు.