MLA, MLCs Sports: రేపటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు.. కెప్టెన్లుగా నారా లోకేష్, మనోహర్

  • అమరావతి: రేపటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు..
  • రేపటి నుంచి మూడు రోజలు పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు..
  • అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత విజయవాడలోని స్టేడియంలో ఆటల పోటీలు..
  • ఒక టీమ్ కెప్టెన్ గా మంత్రి లోకేష్, మరో జట్టు సారథిగా నాదెండ్ల మనోహర్..
Nadendla

Nadendla

MLA, MLCs Sports: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు జరగనున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు సభ్యులకు ఆటల పోటీలు నిర్వహించన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆటల పోటీలు జరగనున్నాయి. అసెంబ్లీ శాసన సభా పక్ష కార్యాలయాల్లో ఇప్పటికే అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. సభ్యులు తమకు నచ్చిన క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. క్రికెట్, క్యారమ్స్, చెస్, టెన్నిస్ సహా అనేక ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు.

Read Also: Niharika : ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు? అవార్డు వేడుక నిర్వాహకులపై మెగా డాటర్ నిహారిక ఫైర్!

అయితే, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సభ్యులకు ఉచితంగా టీ షర్ట్, ట్రాకర్ ఇవ్వనున్నారు. ఇక, ఎమ్మెల్యేల క్రికెట్ లో రెండు జట్లు ఏర్పాటు చేయనుండగా.. ఒక టీమ్ కి కెప్టెన్ గా మంత్రి నారా లోకేష్ వ్యవహరించనుండగా, మరో జట్టుకు సారథిగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉండనున్నారు. కాగా, ఎక్కువ మంది క్రికెట్ పై ఆసక్తి చూపిస్తే మూడో టీం ఏర్పాటు చేసి ఆ జట్టుకు కెప్టెన్ గా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం కనిపిస్తుంది.