Site icon NTV Telugu

Kotamreddy: నాకు మంత్రి పదవి సీఎం జగన్‌ ఇష్టం.. ఆశావహుల జాబితాలో మాత్రం ఉన్నా..

Kotamreddy Sridhar Reddy

Kotamreddy Sridhar Reddy

మంత్రులంతా రాజీనామా చేశారు.. ఇవాళో రేపో కొత్త మంత్రులను ఫైనల్‌ చేయనున్నారు.. దీనిపై తుది కసరత్తు చేస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.. అయితే, ఆశావహులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.. ఈ విషయంపై స్పందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… మంత్రివర్గంలో నాకు స్థానం ఉంటుందా లేదా అన్నది నాకు తెలియదు… కానీ, ఆశావహుల జాబితాలో నేను ఉన్నాను అన్నారు.. మంత్రి పదవులు ఇచ్చే జాబితాలో నాపేరు ఉందా లేదా అన్నది సీఎం జగన్ ఇష్టమేనన్న ఆయన.. 150 మంది ఎమ్మెల్యేలకూ మంత్రి కావాలనే ఆశ ఉంటుందన్నారు. రేపటి వరకూ ఈ ఆశ అందరి ఎమ్మెల్యేలకు ఉంటుంది.. కొత్త జాబితా వచ్చాక సీఎం నిర్ణయాన్ని అందరూ ఏకీభవిస్తారని.. ఇందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. ఇక, ఈ నెల 11వ తేదీ నుంచి జగనన్న మాట గడపగడపకూ కోటంరెడ్డి బాట ప్రారంభిస్తానని వెల్లడించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి… నియోజక వర్గంలోని ప్రతీ ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానన్నారు.. 9 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించారు.

Read Also: Somu Veerraju: విద్యుత్ సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనమే కారణం..

Exit mobile version