Site icon NTV Telugu

ఆనందయ్య భద్రత పై ఎమ్మెల్యే కాకాని సమీక్ష…

ఆనందయ్య కి భద్రత పై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని సమీక్ష నిర్వహించారు. కృషపట్నం పోర్టులో అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం తో పాటు పలువురు పోలీసులు తో సమావేశమయ్యారు ఎమ్మెల్యే కాకాని. ఆనందయ్య కి గట్టి భద్రత ఇవ్వాల్సిందిగా అడిషనల్ ఎస్పీ ని కోరిన ఎమ్మెల్యే కాకాని అనంతరం ఎన్టీవీ తో మాట్లాడుతూ… ఐసిఎంఆర్ వచ్చే అవసరం లేదు. ఆయుష్ నివేదిక నే ప్రభుత్వం ఫైనల్ గా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి సానుకూలంగా వున్నారు కాబట్టి …ప్రభుత్వం పాజిటివ్ గానే స్పందించే అవకాశం ఉంది. అన్ని అనుకూలిస్తే త్వరలో ఆనందయ్య మందు పంపిణీ చేస్తాం. ఆనందయ్యకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆయనకి పోలీసులు రక్షణ కల్పించారు. ఆనందయ్య మందు కోసం ఇతర ప్రాంతాల నుండి ఎవరూ రావొద్దు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాత మేమే వారికి పోస్ట్ లో మందు పంపిణీ చేస్తాం అని పేర్కొన్నారు.

Exit mobile version