అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో కొర్రపాడు పొలం దారి విషయానికి సంబంధించి వార్తలు వచ్చాయి. పొలం మధ్యలో దారి వేస్తున్నారని, తాము నష్టపోతున్నామని ఆ రైతు కుటుంబానికి చెందిన మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గ్రహించారు. 29 ఏళ్ళుగా నలుగుతున్న సమస్యను పరిష్కరించారు.
ఒక బలహీనుడికి దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయం..ఊరు మొత్తం నిస్సహాయమై దీన్ని భరిస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే ముందు నిలబడ్డారు. న్యాయం వైపు ధర్మం వైపు నిలబడటానికి గుండె ధైర్యం కావాలి తెగువ కావాలి. ప్రతి సమస్యలోనూ ఆమె న్యాయం వైపు నిలబడ్డారు.
అదరక బెదరక గుండె ధైర్యంతో బలహీనుల పక్షాన నిలబడ్డారు. ఈ వివాదం వెనుక అసలు నిజాలు పరిశీలించారు. పరిష్కరించారు. 29 సంవత్సరాలుగా వేదన అనుభవిస్తున్న ఒక బలహీన బ్రాహ్మణుడి బాధ ఉంది. ప్రధాన రహదారికి రెడ్డి సామాజిక వర్గం వారి పొలం ఉంది. దాని వెనుక బ్రాహ్మణుల పొలం ఉంది.
రెవెన్యూ రికార్డుల పరంగా వీరి పొలానికి దారి కూడా ఉంది. అయితే ముందు పొలం వారు వీరికి దారి ఇవ్వకుండా వేధిస్తున్నారు. అడిగిన ప్రతిసారీ బ్రాహ్మణులపై దౌర్జన్యం చేయడం లేదా ఇప్పటి లాగే ఆత్మహత్య చేసుకుంటాం అని బెదిరించడం జరుగుతోంది. దీంతో వారు విసిగి వేసారి పోయి, దాని పై ఆశలు వదులుకున్నారు. ఒక చివరి ప్రయత్నంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని సంప్రదించారు.
ఎమ్మెల్యే స్పందించి అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించారు. న్యాయం బ్రాహ్మణ కుటుంబం వైపు ఉందని తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డుల మేరకు, నియమ నిబంధనలు పాటిస్తూ దారి వేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా జనవరిలో అధికారులు నోటీసులు ఇచ్చారు. రోడ్లు వేయకుండా దారిలో ఆ కుటుంబం వారు వరినాట్లు వేశారు. ఆప్రాంతంలో రోడ్డు వేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కుటుంబం నానా యాగీ చేసింది.
కొర్రపాడు పొలం విషయంలో పద్మావతి చూపించిన చొరవ అందరి ప్రశంసలు అందుకుంటోంది. జొన్నలగడ్డ పద్మావతి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది రైతుల సమస్యలకే. నియోజకవర్గానికి నీటిని తీసుకురావడంలో ఆమె చరిత్ర సృష్టించారు. సకాలంలో రైతులకు నీరు ఇవ్వడం మొదలు కొని నియోజకవర్గంలోని అన్ని చెరువులను నీటిని నింపడానికి ఆమె పడిన కష్టానికి రైతులు జయజయధ్వానాలు పలికారు. ఇప్పుడు గిట్టుబాటు ధర కోసం ఒక యాప్ రూపొందించే పనిలో ఉన్నారు. అది కూడా త్వరలో విడుదల కానుంది. రైతులకు న్యాయం చేసిన ఏకైక ఎమ్మెల్యేగా ఆమె శింగనమల చరిత్రలో నిలుస్తున్నారు.