దేశవ్యాప్తంగా రైతులంతా ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెట్టాలన్నారు మిజోరాం గవర్నర్ హరిబాబు. విశాఖలో మూడు రోజులపాటు జరిగే ఆర్గానిక్ మేళాను ప్రారంభించారు మిజోరం గవర్నర్ హరిబాబు, కేంద్ర మంత్రి మురళీధరన్. ఆ ఆర్గానిక మేళాలో గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది.ఈ సందర్భంగా గవర్నర్ హరిబాబు మాట్లాడుతూ.. ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ప్రకృతి వ్యవసాయ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ ఎక్కువగా చిరు ధాన్యాలు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాధాన్యత ఇస్తున్నారు.
Read Also: Naresh-pavitra: నరేష్- పవిత్ర ఎలా పెళ్లి చేసుకుంటారో నేనూ చూస్తా- రమ్య రఘుపతి
కేంద్ర మంత్రి మురళీ ధరన్ మాట్లాడుతూ.. భారత దేశం నుండి ప్రపంచ దేశాలకు ఆర్గానిక్ ఉత్పత్తులు జరుగుతున్నాయ్. అనకాపల్లి బెల్లం కు మంచి ప్రాధాన్యత ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయికి అనకాపల్లి బెల్లంకి మార్కెట్ అయ్యేలా కృషి చేస్తాం అన్నారు. త్వరలో విశాఖలో జరగనున్న జీ 20 సదస్సు ప్రాంగణంలో ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రదర్శన చేపట్టాలన్నారు కేంద్రమంత్రి మురళీ ధరన్. సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు, శాస్త్రవేత్తలతో సదస్సులు నిర్వహిస్తున్నారు.
Read also: Naresh-pavitra: నరేష్- పవిత్ర ఎలా పెళ్లి చేసుకుంటారో నేనూ చూస్తా- రమ్య రఘుపతి
