Site icon NTV Telugu

పలాస ఆర్ధిక రాజధానిగా రూపు దిద్దుకోనుంది…

పలాస – కాశీబుగ్గ మున్సిపాల్టీకి రెండో వైస్ ఛైర్మన్ గా ఒక దళిత సోదరుడు ఎన్నిక కావడం పలాస చరిత్రలో గొప్ప అధ్యాయం అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మంచి సోషలిస్టు. వెనుకబడిన, దళిత గిరిజన వర్గాలకు చెందిన ఐదుగురిని ఉపముఖ్యమంత్రులుగా చేశారు. అన్ని రాజకీయపదవులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ జనగ్ కే దక్కుతుంది. ఇక చెత్త పై పన్నువేసే విషయంలో పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ తొలిఅడుగు వేసింది. పలాస ఆర్ధిక రాజధానిగా రూపు దిద్దుకోనుంది అని తెలిపారు. అలాగే పలాసలోని కే.టిరోడ్డు విస్తరణ మాస్టర్ ప్లాన్ ను 80 అడుగులకే పరిమితం చేశాం అని పేర్కొన్నారు.

Exit mobile version