Site icon NTV Telugu

NTR Health University Name Change: ఎన్టీఆర్‌ను చంద్రబాబు మానసిక క్షోభ పెట్టారు.. ప్రాయశ్చిత్తంగా వర్సిటీకి ఆయన పేరు పెట్టారు..!

Minister Seediri Appalaraju

Minister Seediri Appalaraju

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వివాదం ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతోంది.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమర్థించుకుంటుండగా… దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పుమంటున్నాయి.. నందమూరి ఫ్యామిలీ కూడా ఈ మార్పును తప్పుబడుతోంది.. అయితే, యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సముచితమైన నిర్ణయం అన్నారు మంత్రి సిదిరి అప్పలరాజు… ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు, ఎన్టీఆర్‌ను మానసికంగా క్షోభ పెట్టారు… అందుకే ప్రాయశ్చిత్తంగా యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టారు అని విమర్శించారు అప్పలరాజు.. అయితే, ఆరోగ్యశ్రీ వైయస్సార్ బ్రెయిన్ ఛైల్డ్.. ఆయన పేరు మార్చినప్పుడు మనసుకు తెలియదా? యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సముచితమైన నిర్ణయే అన్నారు.

Read Aslo: CM YS Jagan: గృహ నిర్మాణంపై సీఎం సమీక్ష.. టిడ్కో ఇళ్లపై లబ్ధిదారులకు అవగాహన కల్పించండి..

ఇక, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్టీఆర్‌ వర్సిటీ పేరు మార్పుపై స్పందిస్తూ.. కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి పేరు లేవనెత్తిన విషయంపై స్పందించిన మంత్రి అప్పలరాజు.. కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్ గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదన్నారు.. మెడికల్ విద్య, వైద్య మౌలిక సదుపాయాల కల్పనలో వైఎస్సార్ వేసిన ప్రభావం విప్లవాత్మకమైందని స్పష్టం చేశారు.. మరోవైపు, చంద్రబాబుకు అధికారం పోయినప్పుడే బీసీలు గుర్తుకు వస్తారు అని సెటైర్లు వేశారు. అధికారంలో ఉన్నప్పుడు తోలు తీస్తాం, తొక్క తీస్తాం అని బెదిరించిన విషయం మర్చిపోయావా? అని నిలదీసిన ఆయన.. నాయి బ్రాహ్మణ సోదరులను తోకలు కట్ చేస్తాను అని కించపరచ లేదా? అని మండిపడ్డారు.. ఇప్పుడు ఒక మత్స్యకారుడిని బీసీ సాధికారత సంఘానికి అధ్యక్షుడిని చేశావు.. ఎంత దయనీయ స్థితి… నీది చంద్రబాబు…!! అంటూ మండిపడ్డారు మంత్రి సిదిరి అప్పలరాజు.

Exit mobile version