Site icon NTV Telugu

Minister Roja: చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ముందుంటా

Minister Roja

Minister Roja

విజయవాడలో పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో ఆప్కో ఎగ్జిబిషన్ షోరూంను పర్యాటక శాఖ మంత్రి రోజా గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆప్కో షోరూంలో వస్త్రాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమ్మర్ శారీ మేళాకు తనను పిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళలకు నచ్చేలా అన్నీ ఆప్కో షోరూంలలో ఉన్నాయన్నారు. ప్రజలు కూడా ఆప్కో షోరూంలలో కొనుగోలు చేస్తూ ఆప్కో అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. చేనేత కార్మికులకు మనం సహాయం చేస్తేనే వాళ్లు అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు.

Vangalapudi Anitha: అత్యాచారాలకు కామానేనా? ఫుల్‌స్టాప్ పడేది ఎప్పుడు?

రాష్ట్రంలో చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటోందని మంత్రి రోజా తెలిపారు. చేనేత కార్మికుల బాగు కోసం వారి కుటుంబాలకు ఏటా జగన్ ప్రభుత్వం రూ.24 వేలు ఇస్తోందని గుర్తుచేశారు. భవిష్యత్తులో ఆప్కో మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఊరిలోనూ ఆప్కో శాఖలు ఉన్నాయని.. ప్రత్యేక ఆఫర్లు, డిజైన్లతో ఆప్కో అందరినీ ఆకర్షిస్తోందని మంత్రి రోజా చెప్పారు. చేనేత కుటుంబాలకు కోడలిగా ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు తాను ముందుంటానని మంత్రి రోజా హామీ ఇచ్చారు. కాగా ఆప్కో సంస్థకు మహిళ(నాగరాణి) మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండటం విశేషమన్నారు.

 

Exit mobile version