మంత్రి రోజా ఏ పని చేసినా అందులో సమ్ థింగ్ స్పెషల్ వుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న స్వర్ణోత్సవం సాంస్కృతిక సంబరాలు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమానికి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. గుంటూరులో ఈ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అధికార వైసీపీకి చెందిన అనేక మంది నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేస్తున్నారు.
మంత్రి రోజా గుంటూరులో సందడి చేశారు. జగనన్న స్వర్ణోత్సవ సంబరాల వేడుకలో కళాకారులతో కలసి డాన్స్ వేశారు. కళలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న గుంటూరులో జగనన్న వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి రోజా. తిరుపతిలో జరిగిన స్వర్ణోత్సవ సాంస్కృతిక ఉత్సవాలకు మంత్రి రోజా హాజరై వివిధ ఆల్బమ్ సాంగ్స్ కు డ్యాన్సులు వేసి అందరినీ ఉత్సాహ పరిచారు. రోజా డ్యాన్సుల వీడియోలు యూట్యూబ్ లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతున్నాయి. గతంలోనూ జబర్దస్త్ కామెడీషోలో ఆమె పలు పాటలకు చేసిన డ్యాన్స్ లు అలరించాయి.