Minister Roja: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా జగనన్న క్రీడా సంబరాల బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు రూ.50 లక్షల ప్రైజ్ మనీని మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి అందజేశారు. కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ క్రీడల్లో ప్రతిభ చూపిన మెన్స్, ఉమెన్స్ టీమ్‌లకు ప్రైజ్ మనీ అందజేశారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. హీరోల కంటే జగనన్నే యంగ్‌గా ఉన్నారని.. క్రీడలు, యువత అంటే జగన్‌కు ఎంతో ఇష్టమని తెలిపారు. యువతకు అన్ని రకాలుగా ప్రభుత్వం తరపున జగన్ సహకరిస్తున్నారని స్పష్టం చేశారు. నియోజకవర్గం, జిల్లా, జోనల్ స్థాయిలో పోటీలు నిర్వహించామని.. క్రీడా సంబరాలను పవిత్రమైన ఆశయంతో నిర్వహించినట్లు మంత్రి రోజా పేర్కొన్నారు.
Read Also: DL Ravindra Reddy: ఏపీ ప్రభుత్వంపై డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శలు.. పార్టీ మారబోతున్నారా?
దేశంలోనే ధైర్యం, కమిట్ మెంట్, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ఏకైక నాయకుడు జగన్ అని మంత్రి రోజా ప్రశంసలు కురిపించారు. గత ప్రభుత్వాలు సక్సెస్ అయిన తర్వాత క్రీడాకారులకు సన్మానాలు చేశాయని.. కానీ తాము గ్రామస్థాయి నుంచే క్రీడాకారులను గుర్తిస్తున్నామని మంత్రి రోజా తెలిపారు. వారిలో ప్రతిభను వెలికితీసి తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఏపీకి జగనే 30 ఏళ్లు సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. జగన్‌కు సంపూర్ణమైన ఆరోగ్యం, దుష్టశక్తులను తిప్పికొట్టే శక్తి ఇవ్వాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు మంత్రి రోజా అన్నారు.
