టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చంద్రబాబు, ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ చీరలు కట్టుకోవాలని రోజా వ్యాఖ్యానించారు. టీడీపీ మహిళా ద్రోహుల పార్టీ అని.. అందరికంటే పెద్ద ఉన్మాది చంద్రబాబే అన్నారు. టీడీపీలో ఉన్నంతమంది ఉన్మాదులు దేశంలోనే లేరని రోజా ఆరోపించారు. మహిళ అని చూడకుండా మహిళా ఛైర్‌పర్సన్‌పై చంద్రబాబు దాడి చేయించారని మండిపడ్డారు.
రిషితేశ్వరిని పొట్టనపెట్టుకుంది టీడీపీ నేతలు కాదా అని మంత్రి రోజా విమర్శించారు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టుకోవాలని చంద్రబాబు వియ్యంకుడు అనలేదా అని బాలయ్యను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు మహిళలను బూటుకాళ్లతో తంతాడని రోజా ఆరోపించారు. మహిళా సాధికారతకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని రోజా అన్నారు. మహిళా నాయకురాళ్లతో జగన్ గురించి, భారతమ్మ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయలేని చంద్రబాబు చీర కావాలో, చుడీదార్ కావాలో నిర్ణయించుకోవాలని రోజా పేర్కొన్నారు. దమ్మున్న జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారని.. చంద్రబాబు దొంగలా కరకట్టలో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేత జైన్ మైనర్ బాలికను వేధించటంతో చనిపోయిన ఆ రోజు చంద్రబాబు ఎందుకు స్పందించలేదని రోజా ప్రశ్నించారు.
Home Minister Taneti Vanita: నన్ను ట్రోల్ చేయడం మహిళలకు టీడీపీ ఇచ్చే గౌరవమా?
