Site icon NTV Telugu

కొత్త విద్యా విధానానికి ఏపీ కెబినెట్ ఆమోదం : పేర్ని నాని

కొత్త విద్యా విధానాన్ని ఏపీ కెబినెట్ ఆమోదించింది అని మంత్రి పేర్ని నాని తెలిపారు. కొత్త విద్యా విధానం వల్ల స్కూళ్ల మూసివేత ఉండదు.. ఏ ఉపాధ్యాయుడి ఉద్యోగం తీసే ప్రసక్తే ఉండదు. పీపీ-1, పీపీ-2 మొదలుకుని హైస్కూల్ ప్లస్ వరకు పాఠాశాలలు ఉంటాయి. హైస్కూల్ ప్లస్ కేటగిరిలో మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధన ఉంటుంది. విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలను కెబినెట్లో తీసుకున్నాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం అని తెలిపారు. 1-5 తరగతుల విద్యార్ధులకు ఒకటీ లేదా ఇద్దరు టీచర్లతో విద్యా బోధన జరుగుతోంది.

ప్రస్తుతం అమలవుతోన్న విద్యా విధానంపై సర్వే నిర్వహించాం. విద్యా ప్రమాణాలు సరిగా లేవనే విషయం సర్వే ద్వారా వెల్లడైంది. విద్యార్ధుల జీవితాలను మనమే నాశనం చేస్తున్నామనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. సర్వే ఫలితాలు చూశాక.. విద్యా విధానం మార్చాలనే ప్రయత్నం చేస్తున్నాం. బై లింగ్వల్ టెక్స్ట్ పుస్తకాలు అచ్చు వేసిన మొదటి రాష్ట్రం ఏపీనే. తెలుగు సబ్జెక్ట్ తప్పకుండ ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువతోన్న సుమారు 4 లక్షలకు పైగా పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆరు లక్షలకు పైగా విద్యార్ధులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు అని పేర్కొన్నారు.

Exit mobile version