Site icon NTV Telugu

మళ్ళీ వైసీపీదే అధికారం.. ఎల్లో మీడియా గుర్తు పెట్టుకోవాలి: పెద్దిరెడ్డి

వైసీపీ మళ్ళీ అధికారం లోకి రావడం ఖాయమ‌ని.. ఈ విష‌యాన్ని ఎల్లో మీడియా గుర్తు పెట్టుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల ఫలితాలు మార్చే పరిస్థితి ఉండదని చుర‌క‌లు అంటించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశారని… గ్రామాల్లోకి వెళితే కేవలం ఇల్లు కోసం అర్జీలు, లేదా భూ వివాదాలపై మాత్రమే ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు.

https://ntvtelugu.com/ys-sharmila-comments-on-trs-govt/

జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పధకం సర్వే అనంతరం రాష్ట్రంలో ఎటువంటి భూ వివాదాలు ఉండవని చెప్పారు. భూమిపై హాక్కు ఉంటే ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తుందని స్ప‌ష్టం చేశారు. భూ సర్వే పై సీఎం వైఎస్ జగన్ తరచూ సమీక్ష నిర్వహిస్తున్నారని.. క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఈ అంశం పై కసరత్తు చేస్తోందని చెప్పారు. అర్హులందరికి పథ‌కాలు అందుతాయని.. ఇంత చేస్తున్న ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నాయని నిప్పులు చెరిగారు.

Exit mobile version