NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: నా జీవితంలో ఇంత మంచి పాలన ఎప్పుడూ చూడలేదు

Peddireddy Ramachandra Redd

Peddireddy Ramachandra Redd

Peddireddy Ramachandra Reddy: నా రాజకీయ జీవితంలో ఇంత మంచి పాలనను ఎప్పుడూ చూడలేదంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై మరోసారి ప్రశంసలు కురపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. మంగళగిరిలో అరణ్యభవన్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీశాఖ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాక్షించారు.. ఇక, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మేలు చేసేలా సీఎం వైఎస్‌ జగన్ పాలన ఉందన్న ఆయన.. నా రాజకీయ జీవితంలో ఇంత మంచి పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు.. రాష్ట్ర ప్రభుత్వంపై.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ నియంత పాలన అని విమర్శించడం విడ్డూరంగా ఉందంటూ ఫైర్‌ అయ్యారు.. చంద్రబాబు, పవన్ ఎన్ని దూషణలు చేసినా.. దానిని ఆశీర్వాదంగానే తీసుకుంటామని ప్రకటించారు.. మరోవైపు.. టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అయ్యన్నకు పోయేకాలం దాపురించిందంటూ కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు.. సీఎం వైఎస్‌ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసే వారికి ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read Also: Aparna Balamurali: హీరోయిన్‌తో స్టూడెంట్ మిస్‌బిహేవ్

మంగళగిరి ఇండస్ట్రియల్ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2024లో మరల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని.. నా రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి నేను చూడలేదని.. సంక్షేమం అభివృద్ధితో జగన్మోహన్ రెడ్డి మరల ముఖ్యమంత్రి కాబోతున్నాడని జోస్యం చెప్పారు. ఇక, బీఆర్ఎస్ పార్టీ కి మీరు అనుకూలమా అని మీడియా ప్రశ్నించగా..? ఊహాజనితమైన ప్రశ్నలకు సమాధానం చెప్పనని పెద్దిరెడ్డి ముక్తసరిగా సమాధానం చెప్పారు.

Show comments