Site icon NTV Telugu

Minister Lokesh: ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నాం..

Lokesh

Lokesh

Minister Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ (ఏప్రిల్ 20న) మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నాం.. ఈ రోజు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. 16 వేల 347 డీఎస్సీ పోస్టులతో నేడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది.. నేటి నుంచి ఆన్ లైన్లో డీఎస్సీ అభ్యర్థులు అప్లైయ్ చేసుకోవచ్చు అని సూచించారు. ఇక, డీఎస్సీ అభ్యర్థులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అని లోకేష్ పేర్కొన్నారు.

Read Also: Tamil Nadu: బాలుడికి కరెంట్ షాక్.. ప్రాణాలకు తెగించి రక్షించిన వ్యక్తి

అయితే, 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో 13,192 పోస్టులు భర్తీ చేయనుండగా.. ఎస్జీటీ , స్కూల్ అసిస్టెంట్‌తో పాటు 52 ప్రిన్సిపాల్, 273 పీజీటీ, 1718 టీజీటీ పోస్టులను రాష్ట్ర, జోన్ స్థాయి కోటాలో భర్తీ చేయబోతున్నామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు సీబీటీ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. మెగా డీఎస్సీ -2025 పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం పరీక్షా షెడ్యూలు, సిలబస్, నోటిఫికేషన్ సంబంధిత వెబ్‌సెట్‌లో పెట్టారు.

Exit mobile version