Site icon NTV Telugu

Kodali Nani: సీపీఐ నారాయణ ఓ వింత జంతువు..!

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణపై సెటైర్లు వేశారు మంత్రి కొడాలి నాని.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నారాయణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయన.. సీపీఐ నారాయణ ఓ వింత జంతువు.. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. తానో జాతీయ నాయకుడట.. రెండు ఎంపీ సీట్లు ఉన్న సీపీఐ జాతీయ పార్టీ అయితే.. మాకు 28 మంది ఎంపీలు ఉన్నారన్నారు.. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యలో వైఎస్‌ జగన్ కుటుంబం పాత్ర ఉందంటాడు? అని ప్రశ్నించిన ఆయన.. ఇక, బిగ్ బాస్ షో వ్యభిచార కొంప అంటాడు అంటూ నారాయణపై ఫైర్‌ అయ్యారు.

Read Also: Bhatti Vikramarka Padayatra: ప్రగతి భవన్‌ను బద్దలు కొడతాం..

మరోవైపు.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు చంద్రబాబు శుభాభినందనలు చెబుతున్నాడు అని ఎద్దేవా చేసిన కొడాలి.. తండ్రి, కొడుకులు ఇద్దరికీ మైండ్ చెడిపోయిందన్నారు.. చంద్రబాబు, నారాయణ, జనసేన… వీళ్లందరూ ఎవరైనా పది మందిని చంపి జగన్ మీద తోసేయొచ్చని ప్లాన్‌ చేస్తున్నారేమో అనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొడాలి నాని.

Exit mobile version