Minister Durgesh: రాజమండ్రి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన “పోలీస్ సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలకు మంత్రి దుర్గేష్ తో పాటు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని పుష్పాంజలి ఘటించారు.
Read Also: Sanae Takaichi: జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి ఎన్నిక.. ఊహించని మెజారిటీతో గెలుపు
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. కుటుంబం కంటే ప్రజల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పోలీసుల సేవలు అమూల్యమైనవి.. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు పట్ల నిబద్ధతతో ఉందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడే కీలక బాధ్యత పోలీసులు నిర్వర్తిస్తున్నారు.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 191 మంది అమరుల వీరోచిత సేవలను స్మరించుకోవడం గర్వకారణం అని తెలిపారు. దేశ భద్రత కోసం త్యాగం చేసిన అమరుల జ్ఞాపకార్థం నిర్వహించే ఈ కార్యక్రమం ప్రతి పోలీసుకి స్పూర్తిదాయకం అన్నారు. మాదక ద్రవ్యాలు, సింథటిక్ డ్రగ్స్ లాంటి సామాజిక సమస్యలను ఎదుర్కోవడంలో పోలీసులు మరింత కృషి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
