జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శలు చేశారు. వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. సినిమాల్లో నటించడం, కోట్లు సంపాదించడం మినహా పవన్ కళ్యాణ్‌కు వ్యవసాయం అంటే తెలియదని ఎద్దేవా చేశారు. అన్నీ పాములు ఆడితే ఏలిక పాము కూడా లేచి ఆడిందన్న చందంగా పవన్ కళ్యాణ్ వ్యవసాయం గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచే అర్హత కూడా పవన్ కళ్యాణ్‌కు లేదని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను శనివారం నాడు పరామర్శించారు. దీంతో ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో తాజాగా మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో పాటు ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా పవన్‌ను విమర్శించారు. జగన్ సర్కారుపై చంద్రబాబు దత్తపుత్రుడు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల కష్టాలకు కారణం చంద్రబాబేనని దత్తపుత్రుడు తెలుసుకోవాలని హితవు పలికారు. రైతులను మోసం చేసిన చంద్రబాబును ప్రశ్నించకుండా జగన్ ప్రభుత్వంపై పవన్ నిందలు వేయడం భావ్యంగా లేదన్నారు.
