Site icon NTV Telugu

తెలంగాణ ప్రజలు మరోసారి ఉద్యమించే సమయం వస్తుంది…

jagadish reddy

సమైక్య రాష్ట్రంలో ఆరోజు పాలకులే తెలంగాణ ప్రాంతానికి కరువు సృష్టించారు అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులపై గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే ఇచ్చిన పనులు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పనుల గురించి మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి- కేంద్రం దృష్టికి తీసుకెళ్తాము. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల పై తెలంగాణ ప్రజలు ఉద్యమించే సమయం వస్తది అని తెలిపారు. సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి కోసం ఏనాడు ఆంధ్ర నాయకులు ఆలోచించలేదు. జలయజ్ఞం పేరుతో తెలంగాణ జలాలను వైఎస్సార్ దోపిడీ చేశారు. ఇవ్వాళ మాట్లాడుతున్న నాయకులందరూ వైఎస్సార్ వెంట ఉండి తెలంగాణకు ద్రోహం చేశారు అని అన్నారు.

Exit mobile version