పని చేయడం చేతగాకపోతే స్వచ్ఛందంగా తప్పుకోండి.. లేదా మేమే తొలగిస్తాం అంటూ గ్రామ, సచివాలయ వాలంటీర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలోని ప్రతీ సచివాలయానికి 20 లక్షల రూపాయాలు ఇస్తున్నామని వెల్లడించారు.. ఇంజినీరింగ్ సిబ్బంది బాధ్యతతో పనులు వేగవంతంగా చేయాలని.. ఎస్టిమేషన్ వేసి తొందరగా పనులు జరిపించాలని ఆదేశించారు.. అయితే, కాంట్రాక్టర్లను ఏదో రకంగా భయపెట్టకపోతే పనులు జరగవన్న ఆయన.. అవసరం అయితే కొద్ది మంది కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో కూడా పెట్టాలని తెలిపారు.. ఇక, గతంలో మాదిరీ పెద్ద ఎత్తున లాభాలు రావాలంటే కుదరని కాంట్రాక్టర్లకు సూచించారు. ఇదే సమయంలో.. పనిచేయని వాలంటీర్లను సీరియస్‌గా హెచ్చరించారు.
Read Also: Aishwarya Rai Bachchan: ఈ వయస్సులో ఐష్ మళ్లీ తల్లి కాబోతుందా..?
50 కుటుంబాలకు సేవ చేయలేని వాలంటీర్లు అవసరం లేదని స్పష్టం చేశారు మంత్రి ధర్మాన.. వాలంటీర్లకు కిరీటం పెట్టే పని ప్రభుత్వం చేస్తే కొందరు కిందన ఎసరు పెట్టేపని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, వాలంటీర్ పని కష్టం అనుకున్నవారు స్వచ్ఛందంగా తప్పుకోండి అని సలహా ఇచ్చారు.. లేదంటే మేమే తొలగిస్తామని హెచ్చరించారు.. పనిచేయాలనుకే వాలంటీర్లు తప్పనిసరిగా ఆ యాబై కుటుంబాల భాద్యత తీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు.. గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించిన విషయం తెలిసిందే.. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో వాలంటీర్లు పనిచేస్తున్నారు.