NTV Telugu Site icon

Dadisetti Raja: యనమలకు దాడిశెట్టి సవాల్.. తమ్ముడితో ఆ పని చేయించగలవా?

Dadisetti Raja On Yanamala

Dadisetti Raja On Yanamala

Minister Dadisetti Raja Challenges Yanamala Ramakrishnudu: మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యనమల అనే వాడు పతివ్రత అవతారం ఎత్తాడని.. తాను పతివ్రతని అని చెప్పుకుంటూ, తన తమ్ముడు కృష్ణుడు ఎదవన్నర ఎదవ అని చెప్పుకుంటున్నాడంటూ విరుచుకుపడ్డారు. గత 40 ఏళ్లగా యనమల డైరెక్షన్‌లో కృష్ణుడు తుని నియోజకవర్గంలో ప్రజలను పీడించుకుతిన్నాడని ఆరోపించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై ఏ కేసు పెట్టాలని కృష్ణుడు అడిగితే.. అట్రాసిటీ కేసు పెట్టమని రామకృష్ణుడు చెప్పాడన్నారు.

New Judges: సుప్రీంకోర్టులో కొత్తగా ఐదుగురు జడ్జీలు.. నోటిఫికేషన్‌ జారీ

తునిలో ఎంతోమంది విలువైన ప్రాణాలను తీసేసి, వారి ఆస్తుల్ని కృష్ణుడు కాజేశాడని ఆరోపణలు చేశారు. యనమలకు దమ్ముంటే.. తమ్ముడు ద్వారా తుని ప్రజల నుంచి దోచేసిన సొమ్ములను తిరిగిచ్చేసి, అప్పుడు పతివ్రతను అని చెప్పమనండి అంటూ సవాల్ విసిరారు. ఇదే సమయంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై పరోక్షంగా కౌంటర్లు వేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు కొత్త నాటకానికి తెర లేపారని, తప్పులన్ని వాళ్ళు చేసి జగనన్నపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పార్టీ విడిచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలు, వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరని తాను ఛాలెంజ్ చేస్తున్నానన్నారు. ఇంతకుముందు జగన్‌ను కష్టాల్లో వదిలి 23 మంది వెళ్లిపోయారని, ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలకు రాజకీయ భవిష్యత్ లేకుండా పోయిందని దుయ్యబట్టారు.

Pathaan: బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్… దంగల్ రికార్డులు కూడా బ్రేక్

అంతకుముందు కూడా.. యనమలపై దాడిశెట్టి రాజా మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా యనమల రామకృష్ణుడు కేవలం రెండు నియోజకవర్గాల కోసం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో తన వెనుక తిరిగిన వెంకటేష్‌ రూ.4 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని.. అప్పుడు చేయని తప్పుని తన మీద వేసుకొని మొత్తాన్ని భరించానని.. ఇప్పుడు యనమల అలాగే తన తమ్ముడి తప్పుని ఒప్పుకోగలరా? అని ప్రశ్నించారు. తనకు సంబంధం లేకున్నా.. టీడీపీ నాయకులు గతంలో రైలు దహనం కేసులో తనని అన్యాయంగా ఇరికించారని, అనేక కేసులుపెట్టి ఎంతగానో వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.

AP High Court: పోలీసులకు హైకోర్టు షాక్.. డిబేట్ ఎలా జరుగుతుందని నిలదీత

Show comments