Site icon NTV Telugu

నీటికేటాయింపులపై త్వరలో సమావేశం…

డీఆర్ సీసీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ ఏడాది నీటికేటాయింపులపై త్వరలో సమావేశం ఏర్పాటు అవుతుంది అని జిల్లా ఇంఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. భీమా విషయంలో రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జిల్లాలో 429 లేఅవుట్ లలో ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం. 229 లేవుట్ లలో పనులు ప్రారంభించాం. ఇసుక అందరికి అందుబాటులోకి తెస్తున్నాం.172 ప్రాంతాల లో ఇసుక రీచ్ లను గుర్తించాం. ట్రాక్టర్, బండ్లతో ఉచితంగా ఇసుక సరఫరా చేస్తాం. వారం రోజుల్లో ఇసుక ఇబ్బందులు తీరుతాయి అని తెలిపారు.

ఇక వ్యవసాయ అనుబంధ కార్యదర్శిలు ఇక పై ఆర్బీ కె లలో ఉండాలి. మిగతా వారు సచివాలయాల్లో ఉంటారు. వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వేరుశనగ సాగు తగ్గిపోవడానికి కారణాలను విశ్లేషించమని అదేశించాం. ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

Exit mobile version