Site icon NTV Telugu

ఒక్క రూపాయి కట్టొద్దని చెప్పడానికి నువ్వు ఎవ‌రు ? అచ్చెన్నకు బొత్స కౌంట‌ర్

Botsa Satyanarayana

Botsa Satyanarayana

ఒక్క రూపాయి కట్టొద్దని చెప్పడానికి నువ్వు ఎవ‌రు ? అని అచ్చెన్నాయుడు కు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంట‌ర్ ఇచ్చారు. బెజవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల పనులకు శంకుస్ధాపనలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని.. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తుంటాయి..వారు చేయరు చేసే వాళ్లు చేయనివ్వరని మండిప‌డ్డారు.

https://ntvtelugu.com/ys-sharmila-comments-on-kcr-over-farmers-problems/

జగనన్న శాశ్వత గృహ పథ‌కాన్ని విమర్శించడం సిగ్గుచేటు అని మండి ప‌డ్డారు. ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెస్తున్నారని… మేం ఓటేసిన ప్రజలకు జవాబుదారీతనంగా‌ ఉంటామ‌న్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని.. ప్రజలకు మంచి జరగాలని సిఎం జగన్ ఆలోచిస్తున్నారని వెల్ల‌డించారు. ఓటిఎస్ పై మేం ఎవరిని బలవంతం చేయలేదని క్లారిటీ ఇచ్చారు.

Exit mobile version