NTV Telugu Site icon

జిందాల్ ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి బొత్స…

గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపేటలో వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే జిందాల్ ప్లాంట్ ను పరిశీలించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన మంత్రి బొత్స జిందాల్ ప్లాంట్ ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదజేశాలు ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… 2016లోప్లాంటు పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వంలో కేవలం 10 శాతం మాత్రమే పనులు పూర్తిచేసింది. మేం అధికారంలోకి వచ్చాక ప్లాంట్ ప్రారంభ దశకు వచ్చింది. గుంటూరు, విజయవాడ తాడేపల్లి -మంగళగిరి కార్పొరేషన్ తో పాటు మరొ ఆరు మున్సిపాలిటీలు నుంచి చెత్తను సేకరిస్తారు. జిమదాల్ ప్లాంట్ కు నీటి సమస్య ,విద్యుత్ సమస్య ఉంది వాటిని పరిష్కరించాం అన్నారు. వచ్చే నెలలో ప్లాంటును ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం. విశాఖపట్నంలో కూడా ఇలాంటి ప్లాంట్ నిర్మాణం లలో ఉంది. జిందాల్ ప్లాంట్ చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల నుంచి చెత్తను కూడా సేకరిస్తాం. ఈ ప్లాంటు ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అని తెలిపారు.