విశాఖ నగర వైస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు తిప్పల నాగిరెడ్డి, వరుదు కళ్యాణి, జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, నియోజకవర్గ సమన్వయ కర్తలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. జాతీయ జెండాను మంత్రి అవంతి శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి విశాక రావాలంటే ఐదు గంటల సమయం పడుతుందన్నారు.
Read Also: ఏపీలో కొత్త లెక్కలు… ఇకపై జనాభాలో కర్నూలు జిల్లానే టాప్
కొత్త జిల్లాలు ఏర్పాటు వలన రెండు గంటల లోపే కొత్త జిల్లాలకు చేరుకోవచ్చని మంత్రి అన్నారు. అన్ని జిల్లాలకు మౌలిక వసతులను త్వరలోనే సమకూరుతాయన్నారు. గతంలో చాలా మంది కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని అనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారంటే చేసి చూపిస్తారని మంత్రి అన్నారు. జిల్లాలు ఎక్కువుగా చేయడం వలన కేంద్రం నుంచి నిధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని మంత్రి వివరించారు. ముందు చూపుతో సీఎం జగన్ మోహన్‌రెడ్డి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని మంత్రి పేర్కొన్నారు.
