టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని రెండున్నర ఏళ్లుగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని… చంద్రబాబు నాయుడు మనుషులు ఈ రోజు రెచ్చగొట్టే తీరులో మాట్లాడారని మండిపడ్డారు.. నిన్న సీఎం జగన్ పై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాజకీయాల్లో లేవన్నారు.
ఇక, చంద్రబాబుకి ఇంట్లో సమస్యలు ఎక్కువయ్యాయని కామెంట్ చేవారు అవంతి. ఆ సంక్షోభం దారి మళ్లించేందుకు ఇలా మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు ఎంతగా దిగజారి పోతున్నారనడానికి తాజాగా టీడీపీ నాయకులు తీరు నిదర్శనమన్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్ ను నాయకుడ్ని చేయాలని అనుకుంటారు.. కానీ, టీడీపీ నాయకులు పార్టీ లో అంగీకరించడం లేదని ఎద్దేవా చేశారు. గంజాయి రవాణా కొత్త కాదు.. ఇప్పుడు చిన్న సంఘటన పట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి రెచ్చగొడుతున్నారని…ఫైర్ అయ్యారు అవంతి.
