NTV Telugu Site icon

Minister Appalaraju: అరెస్టుకి ముహూర్తాలు చూడాలా?

ఏపీలో ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ప్రతిపక్షనేత చంద్రబాబు ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇంటికి వెళ్ళి చాలా మాట్లాడారు‌.ౠ మాటలు విని చాలా ఆచ్చర్యపోయాను. అరెస్ట్ చేయటానికి ముహుర్తం , వర్జ్యం , రాహుకాలం చూస్తారా? అని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు. అరెస్ట్ కి ముహుర్తం కావాలంటారు… బెయిల్ పిటిషన్ కు మాత్రం చంద్రబాబుకు సమయం సందర్బం అవసరం లేదు.

అర్దరాత్రి అయినా విచారణ జరగాలని హౌస్ మొషన్ పిటిషన్ వేస్తారు. అశోక్ బాబుని అరెస్ట్ చేయటం తప్పన్నట్లు మటాడుతున్నారు.రాష్ర్ట ప్రభుత్వం కావాలని చేసిననట్లు బాబు మాటాడుతున్నారు. బీకాం ఫేక్ సర్టిపికేట్లు పెట్టి ఏసీటీవో ప్రమోషన్ పొందటం నేరం కాదా..?ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడం తప్పుకాదా…?

చంద్రబాబు , కొడుకు లోకేష్ మాట తీరు బాలేదు. మాట అదుపులో ఉండటం లేదు. నియంత్రణ ఉండటం లేదని ప్రజలు భావిస్తున్నారు. బాబు వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి.అశోక్ బాబు లాంటి క్రిమినల్స్ ని వెంటేసుకు రాకూడదు.తప్పు చేసి ధర్నాలు , రాస్తారోకోలు ఏంటని , ఇలాచేస్తే ప్రజలు మరింత ఘోరంగా బుద్ది చెబుతారన్నారు మంత్రి అప్పలరాజు.