Site icon NTV Telugu

తెలంగాణ ప్రభుత్వంపై తీరుపై ఏపీ మంత్రి ఫైర్‌ !

తెలంగాణ ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతోందని..ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ 800 అడుగులు లోపు ఉంటే చుక్క నీరు తీసుకునే పరిస్థితి లేదని.. మాకు కేటాయింపులు ఉన్న నీటిని వాడుకోవటానికి ప్రాజెక్టులు కడుతుంటే అక్రమమని చెప్పటం ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నించారు. కల్వకుర్తి, నట్టెం,పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు అన్నీ కేటాయింపులకు అదనంగా వాడుకోవటం కోసమే అన్నది వాస్తవం కాదా? కాల్వల వైడనింగ్ చేస్తున్నాం…అది కూడా తప్పంటే ఎలా? అని నిలదీశారు. గత రెండు రోజులుగా ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతోంది అంటున్నారని.. వాళ్ళు చెప్తున్న రాయలసీమ లిఫ్ట్, రాజోలిబండ ప్రాజెక్టులు చట్టంలో లోబడి చేస్తున్నామన్నారు.

read also : 7 సంవత్సరాలగా కురుక్షేత్ర యుద్ధం గుర్తుకు రాలేదా : ఈటలపై తలసాని ఫైర్‌

మాకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు లోబడి కడుతున్నామని పేర్కొన్నారు. ఏ విధంగా ఇది తప్పు అవుతుందో తెలంగాణా ప్రభుత్వం ఆలోచించాలని.. రాయసీమ, నెల్లూరుకు మేము మళ్లించే నీటి వల్ల లబ్ది జరుగుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి వంటివి మీరు పెట్టుకుంటే తప్పు కాదా ? అని నిలదీశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక రెండు రాష్ట్రాలు కలిసుండాలి అని కోరుకున్న వ్యక్తి అని..ఒక అడుగు ముందుకు వేసి స్నేహ హస్తం అందించే మనిషి వైఎస్ జగన్ అని తెలిపారు.

Exit mobile version