సీఎం ఆదేశాల మేరకు విమ్స్ ను సందర్శించాము. విమ్స్ ఏర్పాటు ప్రాధాన్యత రీత్యా చర్యలు తీసుకుంటున్నాం అని మంత్రి ఆళ్ల నాని అన్నారు. 400 ఆక్సిజన్ బెడ్స్ వున్నాయి..వీటిని ఆరు వందల బెడ్ లకు పెంచే ప్రతిపాదనలు చేశారు. ఆక్సిజన్ అందుబాటు బట్టి బెడ్ ల సంఖ్య పెంచే ఆలోచన వుంది. ఇప్పుడు విమ్స్ లో 10 టన్నుల ఆక్సిజన్ అందుబాటులో వుంది. ఈ ఆక్సిజన్ కోటా శాతం పెంచే ఆలోచనలు వున్నయి. విమ్స్ లో 20 టన్నుల ఆక్సిజన్ స్టోరేజ్ సామర్ధ్యం పెంచుతాం. అన్ని బెడ్ లకు సమానంగా ఆక్సిజన్ అందే చర్యలు చేపడుతున్నాం అని అన్నారు.
విమ్స్ లో కోవిడ్ రోగులతో టెలిఫోన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి ఆళ్ల నాని… ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వృధా కాకుండా చర్యలు చెపట్టాలని ఆదేశించాము. విశాఖలో స్మశాన వాటిక లను ఒకటి నుంచి పది వరకు పెంచనున్నాము. రెమిడీసివర్ ఇంజెక్షన్ అక్రమాలపై చర్యలు తప్పవు. విశాఖ కు రోజుకు 80 టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా 100 టన్నుల ఆక్సిజన్ సేకరించే ప్రయత్నం జరుగుతోంది. ఏపీ కి 910 టన్నుల ఆక్సిజన్ అవసరం పై సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. విశాఖ జిల్లా పై ప్రత్యేక దృష్టి పెట్టండని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు అని తెలిపారు.
అయితే ప్రజలు బాధ్యతగా వుండండి. కర్ఫ్యూ సడలింపు సమయంలో అవనసరం గా బయటకు రాకండి. తొలి దశ మాదిరిగానే రెండో దశ కరోనా పరిస్థితిని సీఎం జగన్మోహన్ అధిగమించడానికి చర్యలు చేపట్టారు. విశాఖ జిల్లాలో కలెక్టర్ సహా అధికారులు కోవిడ్ బారిన ప డినా ఆత్మ స్థైర్యం కోల్పోకుండా సేవలు అందించడం అభినందనీయం. చంద్రబాబు కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బురద చల్లే కార్యక్రమం కొత్త ఏమి కాదు. అచ్చెన్నాయుడు విమర్శలకు సమాధానం చెప్పే సమయం మాకు లేదు. నిత్యం విమర్శలు చేసే టిడిపి నాయకులు ప్రజలకు సేవ చేయడానికి ముందుగా రండి. వీలు కాక పోతే దూరంగా వుండండి .కానీ అడ్డు పడకండి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ ఫీజులు పై దృష్టి పెట్టాము. ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా 50 శాతం బెడ్లు ఇవ్వాలని సూచించాము యాజమాన్యాలు అంగీకరించాయి అన్ని పేర్కొన్నారు.