Site icon NTV Telugu

Adimulapu Suresh: సీఎం జగన్‌ కోసం తల కోసుకోవడానికైనా సిద్ధం..!

మరికాసేపట్లో ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ఇక, ముగ్గురు, నలుగురు మినహాయిస్తే కేబినెట్‌ మంత్రులంతా రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది.. ఎవరు ఉంటారు.. ఎవరు కేబినెట్‌ నుంచి పార్టీ బాధ్యతల్లోకి వెళ్లినున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి ఆదిమూలపు సురేష్‌.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కోసం నా తల కోసుకోవటానికి కూడా సిద్ధం అని ప్రకటించారు.. ముఖ్యమంత్రివి ఉన్నత ప్రమాణాలు.. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయటానికి శాయశక్తులా పని చేశాను.. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి నాకు గొప్ప అవకాశం ఇచ్చారు.. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో పని చేయటం గొప్ప అనుభవంగా తెలిపారు ఆదిమూలపు సురేష్.

Read Also: Vellampalli: సంతృప్తికరంగా పని చేశా.. మంత్రులను మారుస్తామని అప్పుడే చెప్పారు..

పేదరికం విద్యకు అడ్డు కాకూడదనే విధానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్… గత పాలకులు విద్యను కార్పొటీకరణ చేయటానికి ప్రయత్నం చేశారన్న ఆయన.. విద్యారంగం సమూల మార్పులకు ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేపట్టారని ప్రశంసలు కురిపించారు.. ఈ మూడేళ్లలో విద్యా రంగంపై 76 సమీక్షలు సీఎం చేపట్టినట్టు వెల్లడించారు.. ఇక, తనకు ఏ బాధ్యత ఇచ్చినా మరింత ఉత్సాహంగా పని చేస్తానని వెల్లడించారు మంత్రి ఆదిమూలపు సురేష్.. కాగా, కాసేపట్లో ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ఆ వెంటనే మంత్రుల రాజీనామాలు ఉండబోతున్నాయి.. ఇక, కొత్త మంత్రులు ఈ నెల 11వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.

Exit mobile version