Site icon NTV Telugu

చంద్రబాబుకు మతి భ్రమించింది: మంత్రి జయరాం

చంద్రబాబుకు మతి భ్రమించిందని మంత్రి గుమ్మనూరు జయరాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండున్నరేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక చంద్రబాబు మాటల దాడులు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు శవరాజకీయాలు, కుల, మత రాజకీయాలు చేస్తున్నారని ఆయన వయస్సుకు ఇవి తగవని మంత్రి జయరాం అన్నారు.జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఇది సమంజసం కాదన్నారు.
నారాలోకేష్‌కు జయంతి, వర్థంతికి తేడా తెలియదని, మంగళగిరిలో నారాలోకేషును కొట్టాలని మంత్రి జయరాం తీవ్ర స్థాయిలో మాటల తుటాలు పేల్చారు.

Exit mobile version