NTV Telugu Site icon

Merugu Nagarjuna: చంద్రబాబు.. కుప్పంలో రాజీనామా చెయ్

Merugu Nagarjuna

Merugu Nagarjuna

వైసీపీ ప్లీనరీ చూశాక చంద్రబాబు పరిస్థితి అగమ్య గోచరంగా వుందన్నారు మంత్రి మేరుగ నాగార్జున. వర్షం పడినా ప్రజలు లెక్కచేయకుండా ఉవ్వెత్తున ఎగసిన కెరటాల్లా ప్లీనరీకి వచ్చారు. ఎలాంటి అవరోధాలు వున్నా జనం ఉత్సాహంగా ప్లీనరీకి వచ్చారు. చంద్రబాబుకు కుప్పం సీటు కూడా చేజారీపోతుందేమో అన్న అనుమానం వచ్చింది. 175 సీట్లు గెలుస్తాం. కుప్పంలో చంద్రబాబు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అన్ని వర్గాలు వున్నాయి.

చంద్రబాబు మోసపూరిత మాటలు జనం నమ్మరు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు జగన్ కు వచ్చాయని చంద్రబాబు భయపడుతున్నారు. విజయమ్మ మాటలను కూడా చంద్రబాబు, ఆయన తాబేదారులు వక్రీకరించారు. విజయమ్మ ఈ రాష్ట్రానికి ఉక్కు మనిషిని ఇచ్చింది. ఎస్సీ, బీసీలను చంద్రబాబు అవహేళన చేశారు. మా ఆరోపణలను చంద్రబాబు ఖండించను కూడా లేదు. చంద్రబాబును ఈ సారి కుప్పంలో కూడా గెలువనీయం. చంద్రబాబుకు ఏ ఒక్క పథకానికీ పేటెంట్ లేదు. పవన్ కళ్యాణ్‌ గురించి నన్ను ఏమడుగుతారు. నేనేమీ చెప్పను… ప్రజలను అడిగితే చెబుతారన్నారు మంత్రి నాగార్జున.

CPM: 175 సీట్లు తప్ప.. జనం గురించి ఆలోచించరా?