Site icon NTV Telugu

AP: మేకపాటి శాఖలు మంత్రి బుగ్గనకు కేటాయింపు.. ఉత్తర్వులు జారీ..

ఆంధ్రప్రదేశ్‌ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సంబంధించిన శాఖలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి కేటాయించింది ప్రభుత్వం… ఈ మేరకు ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో… గౌత్‌రెడ్డి శాఖలను ఇతర మంత్రులుకు కేటాయించిన విషయం తెలిసిందే.. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్‌ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్‌, ఎన్ఆర్ఐ ఎంపవర్‌మెంట్ కేటాయించగా.. అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల వ్యవహారాలను సదరు మంత్రులు చూస్తున్నారు.. అయితే, ఇప్పుడు మేకపాటి శాఖలు మంత్రి బుగ్గనకు కేటాయిస్తూ జీవో జారీ చేశారు.. ఇప్పుడు ఉన్న ఫైనాన్స్, శాసనసభ వ్యవహారాలు, కమర్షియల్ టాక్స్ శాఖలకు అదనంగా ఐటీ, పరిశ్రమలు, కామర్స్ శాఖలు బుగ్గనకు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Read Also: Shashi Tharoor: మోడీ అద్భుతమైన నేత.. శశిథరూర్‌ ప్రశంసలు..

Exit mobile version