Site icon NTV Telugu

Mekapati Family: గౌతమ్‌రెడ్డి వారసుడిని ప్రకటించిన మేకపాటి ఫ్యామిలీ

Mekapati Vikram Reddy

Mekapati Vikram Reddy

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూయడంతో.. ఆయన ప్రతినిథ్యం వచ్చింది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసేది ఎవరు? మరోసారి గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి రంగంలోకి దిగుతారా? లేదా గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన భార్య కీర్తి పోటీ చేస్తారా? ఆ ఫ్యామిలీ మళ్లీ కేబినెట్‌ పదవి దక్కుతుందా? అనే చర్చ జోరుగా సాగింది.. అయితే, ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి రెండో కుమారుడు, దివంగత గౌతమ్ రెడ్డి సోదరుడైన మేకపాటి విక్రమ్ రెడ్డి పేరును ఖరారు చేసింది ఆ ఫ్యామిలీ..

Read Also: AP New Cabinet: కొలువుదీరిన కొత్త మంత్రులు..

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి వారసుడిగా విక్రమ్ రెడ్డిని ఎంపిక చేశామని ప్రకటించారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి… కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో కూడా ఈ విషయాన్ని చర్చించామని వెల్లడించారు.. అయితే, కేబినెట్‌లో చోటుపై స్పందించిన ఆయన.. మంత్రి వర్గంలో స్థానంపై ఎలాంటి చర్చ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. నాకు ఎలాంటి పదవులపై ఆశలేదని స్పష్టం చేసిన మేకపాటి.. నెల్లూరు జిల్లాలో సీనియర్ నేతకే మంత్రి పదవి ఇచ్చారని వ్యాఖ్యానించారు. కాగా, మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుకు గురై 49 ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచారు. 1971లో జన్మించిన ఆయన.. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014, 2019లో రెండు సార్లు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి విజయం సాధించారు. ఇండస్ట్రీస్‌, కామర్స్‌, ఐటీ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిగా సేవలు అందిస్తున్న సమయంలో కన్నుమూశారు. దీంతో.. ఆయన వారసుడిని ఎంపిక చేసింది మేకపాటి ఫ్యామిలీ.

Exit mobile version