Mekapati Chandra Sekhar Reddy: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెంచాయి.. 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఇందులో 6 స్థానాలు వైసీపీ, మరోస్థానాన్ని అనూహ్యంగా టీడీపీ కైవసం చేసుకుంది. ఏడింటికి ఏడు స్థానాలు నెగ్గుతామని ధీమాగా ఉన్న వైసీపీ నాయకత్వానికి ఈ పరిణామం షాక్ వచ్చింది.. ఇక, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇదే సమయంలో.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు, రూ.20 కోట్లు ఇచ్చారని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు. తాను రూ.20 కోట్లు తీసుకున్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమాణం చేసేందుకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఇక, సస్పెన్షన్ వల్ల ఎంతో రిలాక్స్ గా ఫీలవుతున్నాను.. సంతోషంగా ఉందన్నారు మేకపాటి.. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఎంతో ఆనందంగా ఉన్నానని తెలిపారు. మంచి చేసిన వారికి కూడా కొందరు చెడు చేస్తారని మేకపాటి వ్యాఖ్యానించారు. అనుకున్నది చేసేయడం వైసీపీలో అలవాటుగా మారిందని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ కు మద్దతు ఇచ్చినందుకు పార్టీలో చాలా మర్యాదలు చేశారు అంటూ సెటైర్లు వేశారు.. కావాలంటే ఇప్పుడే రాజీనామా చేస్తా… ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ మేకపాటి సవాల్ విసిరారు. పార్టీ అగ్రనేతలకు మానవతా విలువలు అవసరం అని హితవు పలికారు. తాజా పరిణామాలతో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేల్లో గుసగుసలు మొదలయ్యాయని అవ్యాఖ్యానించారు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి..