Site icon NTV Telugu

Python Spotted in Drainage: డ్రైనేజీలో భారీ కొండ చిలువ.. పరుగులు తీసిన స్థానికులు

Untitled Design

Untitled Design

డ్రైనేజీలో భారీ కొండ చిలువ కనిపించడంతో స్థానికులు పరుగులు పెట్టిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. గ్రామానికి సమీపంలో ఓ డ్రైనేజీ కాలువ నుంచి పొలానికి ఇంజిన్ ద్వారా నీటిని తోడుతున్న సమయంలో ఈ భారీ కొండచిలువ బయటకు వచ్చింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గ్రామానికి సమీపంలోని ఓ డ్రైనేజీ కాలువ నుంచి పొలానికి ఇంజిన్ ద్వారా నీటిని తోడుతున్న సమయంలో ఈ భారీ కొండచిలువ బయటపడింది. అనుకోని అతిథిని చూసిన రైతు ఒక్కసారిగా షాక్‌కు గురికాగా, విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఆ కొండచిలువ సుమారు 20 అడుగుల పొడవు ఉంటుందని స్థానికలు తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకుని కొండ చిలువను పట్టుకున్నారు. అనంతరం దాన్ని సమీపంలోని అడవిలో వదిలేశారు. అయితే.. గ్రామంలో తరచూ డ్రైనేజీ కాలువల్లో వన్యప్రాణులు కనిపిస్తున్నాయని, వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు అధికారులను కోరారు.

Exit mobile version