NTV Telugu Site icon

Markapuram: మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు

Markapur

Markapur

ప్రకాశం జిల్లా మార్కాపురంలో మున్సిపల్ శాఖ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. మార్కాపురంలో మాగుంట సుబ్బరామిరెడ్డి పార్కు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకంలో ప్రోటోకాల్ ప్రకారం జిల్లా ఇంచార్జ్ మంత్రి మేరుగ నాగార్జున పేరును వేయాల్సిన పేరుని తప్పుగా ముద్రించారు మునిసిపల్ అధికారులు.

ఇంచార్జ్ మంత్రి మేరుగ నాగార్జున పేరును మేరుగ నాగార్జునరెడ్డిగా తయారు చేయించారు అధికారులు. వెంటనే గుర్తించి మార్పులు చేశారు. పేరు చివర ఉన్న రెడ్డికి నలుపు రంగు వేయించారు అధికారులు. ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమంలో హాజరైన మరికొందరి పేర్లు వేయాల్సి ఉన్నా విస్మరించారు అధికారులు. మున్సిపల్ అధికారుల వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధుల పేర్లు వేయాలని, కానీ అధికారులు బాధ్యతారహితంగా పనిచేస్తున్నారని నేతలు విమర్శిస్తున్నారు. తమకు కనీసం మర్యాద కూడా దక్కడం లేదని ప్రజాప్రతినిధులు ఆగ్రహంతో వున్నారు. కనీసం మంత్రి గారి పేరైనా సరిగా వేయలేదని మండిపడుతున్నారు.ఈ వివాదంపై అధికారులు ఏం సమాధానం చెబుతారో చూడాలి.

T Congress : నేటి నుంచి కాంగ్రెస్‌ రైతు రచ్చబండ కార్యక్రమం