NTV Telugu Site icon

పోలీసులే లక్ష్యంగా మావోల బూబి ట్రాప్‌లు.. తృటిలో తప్పిన ప్రాణం

కూంబింగ్‌ నిర్వహించే పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబి ట్రాప్‌లు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మల్లంపేట అటవీ ప్రాంతంలో బూబి ట్రాప్ లు మావోయిస్టులు అమర్చారు. కూబింగ్ చేసే పోలీస్ బలగాలు లక్ష్యంగా ఏడు చోట్ల పదునైన వెదురు కర్రలతో బూబి ట్రాప్‌లను మావోలు ఏర్పాటు చేశారు.

కానీ… చింతూరు డివిజన్‌ పోలీసులు ఎంతో చాకచక్యంగా బూబి ట్రాప్ లను గుర్తించి ధ్వంసం చేశారు. కాలిబాటల్లో గోతులు తవ్వి పదునైన వెదురు కర్రలతో ట్రాప్‌లను మావోయిస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీసులు ముందు చూపుతో గుర్తించడంతో తృటిలో తప్పిన ప్రాణనష్టం తప్పింది.