NTV Telugu Site icon

టీడీపీ కార్యాలయానికి పోలీసుల నోటీసులు

టీడీపీ నేత పట్టాభిరామ్‌.. సీఎం వైఎస్‌ జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల తర్వాత మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు.. ఇదే సమయంలో.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ దాడులు జరిగాయి.. ఇక, ఇప్పటి వరకు పార్టీ కార్యాలయంపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఇవాళ టీడీపీ కార్యాలయానికి మంగళగిరి పోలీసుల నోటీసులు ఇచ్చారు.. కార్యాలయ ఉద్యోగి బద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు.. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరాలు అందివ్వాలని పార్టీ రిస్పెషన్ కమిటీ సభ్యుడు కుమార స్వామికి నోటీసులు అందజేశారు.