Site icon NTV Telugu

Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే రాలేదు..!

Alla Ramakrishna Reddy

Alla Ramakrishna Reddy

Alla Ramakrishna Reddy: గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. సోమవారం రోజు సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సమీక్షా సమావేశానికి గైర్హాజరయ్యారు ఆళ్ల.. అయితే, ఆర్కే, పార్టీకి మధ్య గ్యాప్‌ పెరుగుతోందని.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వడం కూడా కష్టమేననే ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో ఆయన సీఎం సమావేశానికి డుమ్మా కొట్టడం చర్చగా మారింది.. అయితే, నిన్న సీఎంతో ఎమ్మెల్యేల సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. తన ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో పాటు, తనకు చిన్నచిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకే సమావేశానికి వెళ్లలేదన్నారు.. 99 శాతం ఎమ్మెల్యేలు హాజరై ఒకరో ఇద్దరో రాకపోతే దాన్ని మీడియా హైలెట్ చేయడం బాధాకరం అన్నారు..

ఇక, నేను మంగళగిరిలో పోటీ చేసినా.. చేయకపోయినా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయం అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు ఆర్కే.. నేను రాజకీయాలలో ఉంటే సీఎం వైఎస్‌ జగన్ తో ఉంటాను.. లేదంటే వ్యవసాయ పనులు చేసుకుంటానని స్పష్టం చేశారు.. ఇక, నేను పార్టీ మారే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు.. మా బాస్‌ వైఎస్‌ జగన్‌.. ఆయన చెప్పిందే ఫైనల్‌.. నేను పోటీ చేయకపోయినా మంగళగిరిలో గెలిచేది వైసీపీయే అని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. కాగా, తాడేపల్లి వేదికగా సోమవారం గడపగడపకు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌.. ఆ సమావేశానికి కొందరు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు గైర్హాజరైన విషయం విదితమే. ఇక, ఎన్టీవీతో మాట్లాడిన ఆర్కే ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడం కోసం.. కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Exit mobile version