Site icon NTV Telugu

RK: మంత్రి పదవి అవసరంలేదు.. ఎప్పటికీ జగనన్న సైనికుడినే..

Mla Rk

Mla Rk

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ విస్తరణ అధికార పార్టీలోని అసంతృప్తులను బయటపెట్టింది.. కేబినెట్‌లో స్థానం కోల్పోయినవారిని, పదవి ఆశించి నిరాశ ఎదురై అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీ అధిష్టానం బుజ్జగించి.. మళ్లీ అందరినీ లైన్‌లోకి తీసుకొచ్చింది.. అయితే, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అలియాస్‌ ఆర్కే కూడా పదవి ఆశించారని.. మంత్రి పదవిరాకపోవడంతో అలకబూనారనే వార్తలు వచ్చాయి.. దీనిపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే ఆర్కే.. నేను మంత్రి పదవి ఆశించలేదని స్పష్టం చేసిన ఆయన.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు.. తనకు మంత్రి పదవి అవసరం లేదు.. నియోజకవర్గ అభివృద్దే నాకు ముఖ్యం అని పేర్కొన్నారు.. అదే విషయం కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కలసి చెప్పాను అని గుర్తుచేసుకున్నారు.. ఇక, మంత్రి పదవితో సంబంధం లేకుండా.. నేను ఎప్పటికీ జగనన్న సైనికుడిలా ఉంటాను అని ప్రకటించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.

Read Also: Beast Movie Review : బీస్ట్ (తమిళ డబ్బింగ్)

Exit mobile version